ప్రజాస్వామ్యం లేకపోతే పాక్‌లో ఏదైనా ఊహించవచ్చు

పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పకూలితే తాలిబాన్ తీవ్రవాదుల చేతుల్లోకి అణ్వాయుధాలు వెళతాయని ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం విఫలమై, ప్రపంచ దేశాలు సహకరించని పరిస్థితులు ఏర్పడితే తాలిబాన్ల చేతిల్లోకి పాకిస్థాన్ అణ్వాయుధాలు చేరతాయని జర్దారీ పేర్కొన్నారు.

పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం విఫలమైనప్పుడు.. ఎటువంటి పరిస్థితినైనా ఊహించవచ్చన్నారు. జర్మనీ వార్తాపత్రిక "డెర్ స్పైగెల్"కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జర్దారీలో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం ఉన్నంతవరకు అటువంటి పరిస్థితి తలెత్తే ప్రసక్తే లేదన్నారు. దేశంలోని అన్ని కీలకమైన ప్రదేశాలు, ఆయుధాగారాలకు ఎల్లప్పుడు అదనపు భద్రత ఉంటుందన్నారు.

అణ్వాయుధాలు రష్యా తయారు చేసిన "కలాశ్నికోవ్" తపాకులు కాదని, వాటి సాంకేతిక పరిజ్ఞానం చాలా క్లిష్టమైనది. వీటిని ఉపయోగించడం బటన్ నొక్కినంత సులభం కాదన్నారు. పాకిస్థాన్ అణు సామర్థ్యం పూర్తిగా సురక్షిత హస్తాల్లో ఉందని జర్దారీ హామీ ఇచ్చారు. పాకిస్థాన్ అణ్వాయుధాలపై ప్రపంచదేశాలు ఇటీవల కాలంలో ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో జర్దారీ ఈ వ్యాఖ్యలు చేశారు.

వెబ్దునియా పై చదవండి