భారత-పాక్ సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గించిన పాక్

భారత-పాక్ సరిహద్దుల్లోనున్న పాకిస్థాన్ సైన్యాన్ని ఆ దేశం తగ్గించిందని పాక్, ఆఫ్గనిస్థాన్ దేశాలకు అమెరికా ప్రత్యేక దూతగా వ్యవహరిస్తున్న రిచర్డ్ హాల్‌బ్రూక్ తెలిపారు.

నిరుడు భారత్‌లోని ఆర్థిక పట్టణమైన ముంబైలో జరిగిన మారణకాండ తర్వాత పాకిస్థాన్ దేశం తమ దేశానికి చెందిన సైన్యాన్ని తూర్పు దిశగా అంటే భారత్ వైపు పంపే సైన్యాన్ని పశ్చిమదిశగా మళ్ళించిందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో భారత్ సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గించిందని ఆనయ తెలిపారు.

ముంబై దాడుల తర్వాత భారత్-పాకిస్థాన్ దేశాలమధ్యనున్న సరిహద్దుల్లో సైనికుల పహారా చాలా పటిష్టంగా ఉండిందని, కాని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, మెలమెల్లగా పాక్ తన సైన్యాన్ని పశ్చిమ దిశగఅంటే ఆఫ్గనిస్థాన్‌వైపమళ్ళిస్తోందని ఆయన వివరించారు.

ఇదిలావుండగా ఈ మధ్యనే ఆయన స్వాత్ లోయ, తదితర ప్రాంతాలలో పర్యటించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తూ అక్కడి సైనిక చర్యలపైకూడా దృష్టిపెట్టినట్లు సమాచారం. కాగా పాక్ సైనికులు తీసుకుంటున్న చర్యలగురించి వివరించడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు.

వెబ్దునియా పై చదవండి