రష్యా 11 మిగ్ యుద్ధ విమానాలను భారత్‌కు అందించినట్లు మిగ్ కార్పోరేషన్ అధిపతి సెర్గీ కరోట్కోవ్ బుధవారం పేర్కొన్నారు. ఈ యుద్ధ విమనాలను మోసుకెళ్లే వాహక నౌక వచ్చే ఏడాదికి అందనుంది. ప్రస్తుతం పదకొండు అందించాం ఈ ఏడాది ఆఖరుకు మరో ఐదు అందిస్తామని సెర్గీ మాస్కోలో పాత్రికేయులకు తెలిపారు.
భారత నౌక దళానికి చెందిన విమాన వాహక నౌక అడ్మిరల్ గోర్షకోవ్‌ను ఆధునీకరించే ఒప్పందంలో భాగంగా 16 మిగ్-29కే/కేయూబీ యుద్ధ విమానాలను సరఫరా చేసే కాంట్రాక్ట్‌పై రష్యా 2004లో సంతకం చేసింది. ఈ ఒప్పందం విలువ 974 మిలియన్ డాలర్లు. 2010 మార్చిలో మరో 29 మిగ్ యుద్ధ విమానాల సరఫరాకు సంబంధించిన 1.5 బిలియన్ డాలర్ల అదనపు ఒప్పందాన్ని రెండు దేశాలు కుదుర్చుకున్నాయి.