భారత్‌ను సందర్శించనున్న పాక్ పార్లమెంటరీ బృందం!

పాకిస్థాన్‌ పార్లమెంటరీ బృందం భారత్‌ను సందర్శించనుంది. ఇరు దేశాల మధ్య నెలకొనివున్న వివిధ సమస్యల పరిష్కార కృషిలో భాగంగా ఇరుదేశాల పార్లమెంటేరియన్ల మధ్య ప్రారంభమైన చర్చల ప్రక్రియకు కొనసాగింపుగా 19మంది సభ్యుల పాక్ పార్లమెంటరీ బృందం ఈ 17వ తేదీన భారత్‌కు రానుంది.

పాకిస్థాన్‌లోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన ఈ బృందం, భారత పార్లమెంటేరియన్లతో ఢిల్లీలో 18, 19 తేదీలలో సమావేశమంకానుంది. ఈ రెండు దేశాల మధ్య తొలి విడత చర్చలు గత జనవరిలో ఇస్లామాబాద్‌లో జరిగాయి.

పాకిస్థాన్‌కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. పాక్ సెనేట్ డిప్యూటీ ఛైర్మన్ జాన్ మహమ్మద్ ఖాన్ జమేలీ, పాక్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఫైజల్ కరీం కుండీ పాకిస్థాన్ బృందానికి నాయకత్వం వహిస్తారు.

వెబ్దునియా పై చదవండి