యువకుని కాల్చివేత: పాకిస్థాన్ సైనికుడికి మరణశిక్ష

శనివారం, 13 ఆగస్టు 2011 (09:24 IST)
నిరాయుధుడైన ఒక సైనికుడిని కాల్చి చంపిన కేసులో పాకిస్థాన్ పారామిలిటరీ దళానికి చెందిన ఒక జవానుకు కరాచీ కోర్టు మరణశిక్ష విధిస్తూ శుక్రవారం సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో దోషులుగా తేలిన మరో ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు విధించింది.

గత జూన్ నెలలో సర్పరాజ్ అనే యువకుడిని దొంగగా భ్రమపడి ఏడుగురు సైనికులు కాల్పి చంపిన విషయం తెల్సిందే. ఇది పాక్‌లో సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారణలో వీడియో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు సైనికుడిని ముద్దాయిగా నిర్ధారించి మరణశిక్షను ఖరారు చేసింది.

కాగా, పాకిస్థాన్‌లో భద్రతా దళాలకు వ్యతిరేకంగా ఇటువంటి తీర్పులు వెలువడటం అరుదైన విషయమే అయినప్పటికీ భద్రతా దళాలను ప్రజలకు జవాబుదారీ చేసేందుకే ఈ తీర్పులను వెలువరిస్తుంటారని సైనిక వర్గాలు వివరించాయి.

వెబ్దునియా పై చదవండి