ఆస్ట్రేలియాలో భారతీయులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో దాడులకు వ్యతిరేకంగా ఆదివారం సిడ్నీలో వెయ్యిమంది భారతీయులు ప్రదర్శన నిర్వహించారు.
ఈ ర్యాలీని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ సిడ్నీ ఛాప్టర్, నేషనల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్‌లు సంయుక్తంగా నిర్వహించాయి.
ఈ రెండు సంఘాలు కలిసి సిడ్నీలోని టౌన్ హాలు నుంచి హై పార్క్ వరకు ర్యాలీని నిర్వహించారు. ప్రదర్శనలో పాల్గొన్నవారు దాదాపు వెయ్యిమంది వరకు ఉంటారు.
ర్యాలీలో పాల్గొన్నవారు 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేస్తూ వారు ప్రదర్శనను కొనసాగించారు. ఈ ర్యాలీ ద్వారా తమ వారిపై జరిగిన దాడులకు న్యాయం చేయాలని భారతీయ విద్యార్థులు కోరారు.