హెలికాప్టర్ కూల్చివేతపై చర్చించిన ఒబామా, కర్జాయ్

ఆఫ్ఘనిస్థాన్‌లో సైనిక రవాణా హెలికాప్టర్‌ను తాలిబాన్లు కుప్పకూల్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌లు ఆదివారం చర్చించుకున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది.

శుక్రవారం తాలిబాన్లు క్షిపణి ప్రయోగించడంతో ఛినూక్ రవాణా హెలికాప్టర్‌ కుప్పకూలి 38 మంది సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో 24 మంది అమెరికా నేవీకి ప్రత్యేక దళం సీల్స్‌ కమాండోలు, ఏడుగురు ఆఫ్ఘన్ సైనికులు, ఒక వ్యాఖ్యాత ఉన్నారు.

పది సంవత్సరాల నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా చేస్తున్న యుద్ధంలో తాలిబాన్లు అమెరికా హెలికాప్టర్‌ను కూల్చడం ఇది రెండోసారి. అమెరికా సైనికులు తాలిబాన్‌ కమాండర్ దాగివున్న ఒక నివాసంపై దాడిచేసి వెళ్తుండగా తాలిబాన్లు క్షిపణిని ప్రయోగించారు.

వెబ్దునియా పై చదవండి