భారత్‌లో అతివేగంగా ఇంటర్నెట్ అందించే ఆరు సంస్థలేంటి?
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (12:47 IST)
భారత్‌లో అతివేగంగా ఇంటర్నెట్ అందించే ఆ ఆరు సంస్థల పేరేంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం చదవండి. అతివేగ ఇంటర్నెట్‌తో పాటు ప్రత్యేక ఇంటర్నెట్ ఆఫర్లను ఇవ్వడంలో ఇతర దేశాలు ముందున్నా.. భారత్ అదే రూటులో పయనిస్తోంది. పలువేరు ఇంటర్నెట్ సేవలు అందించడంలో భారత కంపెనీలు కూడా మెరుగ్గా పనిచేస్తున్నాయి.
యాక్ట్ యాక్ట్ ఫైబర్ నెట్:
భారత్‌లో నాణ్యతతో కూడిన ఇంటర్నెట్ సేవలు అందించే సంస్థల్లో యాక్ట్ ముందుంది. యాక్ట్ ఇంటర్నెట్ చౌక ధరలోనే లభిస్తుంది. ఈ సంస్థ రూ.1,999లకే సెకనుకు దాదాపు 100 ఎంబీల వేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది.
ఎయిర్ టెల్ బ్రాడ్‌బ్యాండ్ యాక్ట్ :
ఎయిర్ టెల్ సంస్థలో రూ.2,399 చెల్లించి అత్యధికంగా సెకను 40 ఎంబీల వేగంతో ఇంటర్నెట్ పొందవచ్చు. అయితే ఇతర ప్లాన్‌లలో సెకను ఒక ఎంబీ మాత్రమే పొందే అవకాశం ఉంటుంది.
యు బ్రాడ్‌బాండ్ :
దేశంలోని ఇతర సంస్థలకు ధీటుగా వేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలను యు బ్రాండ్ అందిస్తోంది. రూ.1,724 చెల్లిస్తే.. సెకనుకు 100 ఎంబీల వేగంతో ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు.
టికోనా బ్రాడ్ బ్యాండ్ :
భారత్‌లో అభివృద్ధి చెందుతున్న సంస్థల్లో ఒకటైన టికోనా కూడా వేగంతో కూడిన ఇంటర్నెట్ అందిస్తోంది. సెకనుకు 2 ఎంబీల నుంచి 4 ఎంబీల వరకు ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. అత్యధికంగా రూ.950 చెల్లిస్తే 80 జీబీల వరకు పొందవచ్చు.
రిలయన్స్ బ్రాండ్ బ్యాండ్ :"
రిలయన్స్ బ్రాండ్ బ్యాండ్ 12 ఎంబీలతో కూడిన వేగంతో ఇంటర్నెట్ అందిస్తోంది. ఇందుకు రూ.999లు చెల్లించాలి.
ఎంటీఎన్ఎల్ బ్రాండ్ బ్యాండ్ :
ఈ సంస్థ సెకనుకు 100 ఎంబీలతో కూడిన వేగంతో రూ.6,999లకే అధిక ధరకు ఇంటర్నెట్ ఇస్తోంది.