పిల్లవానికి పాలు తాగించడంలో కొన్ని నియమాలు

తల్లి ఒడిలో పిల్లవాడు కేవలం ఆహారంగా పాలను మాత్రమే తీసుకుంటాడు. ఈ పాలు తల్లిపాలు కావచ్చు, లేదా ఆవు, ఎనుము(బర్రె) మేకపాలుకూడా కావచ్చు. శిశువుకు పాలు పట్టడంలో కొన్ని నియమాలున్నాయి. వీటిని పాటిస్తే శిశువు ఆరోగ్యంగాకూడా ఉంటాడని వైద్యులు తెలిపారు.

శిశువుకు తల్లిపాలే శ్రేష్టమైనవి. కాని తల్లి అనారోగ్యం కారణంగా పాలు ఇవ్వలేకపోతే లేదా బలహీనంగా ఉండి పాలు ఇవ్వలేక పోయిన పక్షంలో ఇతర పాలను పట్టవచ్చు.

** తల్లి ఒకవేళ ఆరోగ్యంగా ఉంటే తప్పనిసరిగా శిశువుకు తల్లిపాలనే పట్టాలి. కాని తల్లి పాలు ఇవ్వలేని స్థితిలో ఆవు, ఎనుము లేదా మేక పాలు పట్టాల్సి ఉంటుంది.

** తల్లి పాల తర్వాత ఆవు పాలు శ్రేష్ఠమైనవి. ఈ పాలు త్వరగా పిల్లలకు అరిగిపోతుంది. అలాగే ఇది చాలా ఆరోగ్యంగానూ ఉంటుంది. ఇందులో తల్లి పాలలో ఏ గుణాలైతే ఉంటాయో అవన్నీకూడా ఆవు పాలలో ఉంటాయంటున్నారు వైద్యులు.

** పిల్లవానికిచ్చే ఆహారంకన్నాకూడా పాలు త్వరగా జీర్ణమౌతాయి. త్వరత్వరగా మనం అన్నం తినలేము. కాని పాలను మాత్రం త్రాగగలం. అదే అన్నంకన్నాకూడా పాలు త్వరగా జీర్ణమౌతుంది. పిల్లవానికి సమయానుసారం పాలును ఇస్తుండాలి. కాని నిద్రపోతున్న శిశువును మాత్రం నిద్రలేపి మరీ పాలు ఇవ్వకూడదు.

** ఒకవేళ పిల్లలకు ఆవు లేదా ఎనుము పాలను ఇవ్వాల్సివస్తే ఆవు పాలను బాగా వేడి చేసి అందులోని మీగడను తొలగించి పిల్లలకు పట్టాలంటారు వైద్యులు. అదే ఎనుము పాలను ఇవ్వవలసి వస్తే పాలకు సగం నీళ్ళను కలిపి బాగా కాచిన తర్వాత ఆ పాలను గోరువెచ్చనిదిగా చేసి పిల్లవానికి ఇవ్వాలి.

** పిల్లవానికి పాలు పట్టే సమయం ప్రతి రోజూ ఒకేవేళలో ఉండాలి. పిల్లవానికి పాలు పట్టేటప్పుడు అందులో చక్కెర కూడా కాసింత కలిపి ఇవ్వాలి. ప్రతిసారీ పాలను పిల్లవానికి పట్టేముందు సీసాను బాగా కడిగి ఆరబెట్టి మళ్ళీ అందులో పాలుపోసి పిల్లవానికి పట్టాలి.

** తల్లి పిల్లవానికి తన పాలను పట్టేటట్టైతే సమయానుసారమే పట్టాలని, అదే సమయంలో తల్లి పిల్లవాని శరీరం వేడిగా ఉందా లేదా అనే విషయంకూడా గమనించాలంటున్నారు వైద్యులు. మీరు పిల్లవానికి పాలను ఇచ్చేటప్పుడు మీలో ఎలాంటి ఆలోచనలుండకూడదు. మనసు ప్రశాంతంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

** పడుకుని, నిద్రపోతూ లేదా ఏడుస్తూ పిల్లవానికి పాలు పట్టకూడదు. కూర్చుని శిశువును ఒళ్ళో పడుకోబెట్టి పాలు పట్టాలని వైద్యులు చెబుతున్నారు.

** పిల్లవానికి దంతాలు వచ్చేంతవరకు తల్లి పాలను పడుతుండాలి. దీంతో శిశువు ఆరోగ్యంగా ఉంటూ వారిలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుందని వైద్యులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి