నీ పెళ్లి ఆల్బంలో ఈ 'దళారి' లేని ఫొటో ఉందా? అఖిలేష్‌కు అమర్ సింగ్ కౌంటర్

శుక్రవారం, 28 అక్టోబరు 2016 (09:03 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీలో ప్రస్తుతం నెలకొన్న వివాదానికి బహిష్కృత నేత అమర్‌సింగ్‌ పునరాగమనమే కారణమని, ఆయన ఓ రాజకీయ దళారిగా వ్యవహరిస్తున్నారంటూ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై అమర్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. అఖిలేష్‌ వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 'నన్ను దళారీ అంటున్నారు. మరి... అఖిలేష్‌ పెళ్లి చేసింది ఎవరు? డింపుల్‌తో ఆయన పెళ్లి ములాయం కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు. కానీ, అఖిలే్‌షకు నేను మద్దతుగా నిలిచా. ఆయన పెళ్లి ఆల్బంలో నేను లేని ఫొటో ఒక్కటైనా ఉందా?' అని ప్రశ్నించారు. 
 
ఒకవేళ తాను వైదొలగితే పార్టీ బాగుపడుతుందని అఖిలేష్‌ భావిస్తే సంతోషంగా తప్పుకుంటానని చెప్పారు. తానెప్పుడూ ములాయం సింగ్‌ కొడుకు అఖిలే‌ష్‌తోనే ఉంటాను తప్ప... ఉత్తరప్రదేశ్‌ సీఎంతో కాదని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి