శరన్నవరాత్రులు ప్రారంభం: తొమ్మిది రోజులు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసా?

మంగళవారం, 13 అక్టోబరు 2015 (12:14 IST)
శరన్నవరాత్రులు అక్టోబర్ 13 (మంగళవారం) నుంచి ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మలగన్న అమ్మను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం ఈ రోజుల్లో అమ్మ తమను చల్లగా చూడాలని.. చేపట్టిన పనుల్లో విజయం అందించాలని కనకదుర్గమ్మను భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ తొమ్మిది రోజులు పూజతో పాటు ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే పార్వతీదేవి కటాక్షాలు లభిస్తాయని తెలుసుకుందాం.. 
 
అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 21 వరకు శరన్నవరాత్రులుంటాయి. మంగళవారం ప్రారంభమయ్యే రోజున ఘటస్థాపన చేసి ఎరుపు రంగు దుస్తుల్ని ధరించాలి. అక్టోబర్ 14న (బుధవారం) ముదురు రంగు (రాయల్ బ్లూ) దుస్తులు ధరించడం మంచిది. గురువారం బ్రహ్మచారిణీ దేవిని పూజించడంతో పసుపు రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. ఇక శుక్రవారం ఆకుపచ్చ రంగులో డ్రెస్‌లు ఎంపిక చేసుకోవడం శుభపలితాలను ఇస్తుంది. 
 
అక్టోబర్ 17, శనివారం బూడిద (గ్రే) రంగు దుస్తులు, అక్టోబర్ 18, ఆదివారం - స్కందమాత పూజ కారణంగా ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించాలి. అక్టోబర్ 19, సోమవారం - కాత్యాయనీ పూజ, సరస్వతీ పూజ చేయడంతో తెలుపు రంగు దుస్తులు ఉత్తమం. అక్టోబర్ 20, మంగళవారం - కాళరాత్రి పూజ, గులాబీ (పింక్) రంగు దుస్తులు వేసుకోవాలి. చివరి రోజైన అక్టోబర్ 21 బుధవారం రోజున- దుర్గాష్టమి కావడంతో మహాగౌరి పూజ చేయాలి. ఆ రోజున ఆకాశ నీలం అంటే స్కై బ్లూ కలర్ దుస్తుల్ని ధరించడం ద్వారా పార్వతీ దేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయని, ఈతిబాధలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి