కైలాసం ఎందుకు వెళ్లాలి... ఫలితములు ఏమిటి...?

శనివారం, 4 అక్టోబరు 2014 (18:20 IST)
ప్రపంచంలో అనేకమంది గొప్పగొప్ప జ్ఞానులు తమ శక్తుల్ని, జ్ఞానాన్ని ముందు తరాల వాళ్లకి అనుభవపూర్వకముగా తెలుసుకోవాలని ఒక శక్తి రూపములో ఒకచోట నిక్షిప్తం చేశారు. అది ఎలాంటిచోటు అంటే, మనుషులు సాధారణంగా వెళ్లివచ్చే చోటై ఉండదు. అలా అని వారు వెళ్లలేని చోటుగా కూడా ఉండదు. మనసులో నమ్మకం, విశ్వాసము ఉన్నవాళ్లు మాత్రమే కొంచెం కష్టపడి వెళ్లి వచ్చే స్థలములలో ఆ జ్ఞానం దాచి ఉంచారు. అటువంటి ప్రదేశాల్లో మొదటి స్థానంలో ఉన్నది కైలాష్. 
 
యోగానికి ఆదిగురువు శివుడు. శివుడు తన జ్ఞానాన్ని కైలాసములోనే శక్తి రూపంలో దాచి ఉంచాడు. అందుకే కైలాసాన్ని శివుని స్వస్థలం అని చెపుతారు. శివుడు అక్కడే కూర్చుని ఉన్నాడని అర్థంకాదు. ఆ కొండలో తన జ్ఞానాన్ని, శక్తిని, కృపని నిక్షిప్తం చేసి పెట్టాడని అర్థం. కైలాసం అనేది ప్రపంచంలో ఒక మహత్తరమైన గ్రంథాలయములు చాలా ఉన్నాయి. కాని కైలాసంతో పోల్చి చూస్తే ఇటువంటి గ్రంథాలయం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఈ గ్రంథాలయం నుండి జ్ఞానాన్ని పొందాలంటే మనం అక్కడికి వెళ్లాలని నేను చెపుతున్నాను. ఇషా నుంచి భక్తులను నేను ఎందుకు తీసుకెళుతున్నానంటే ప్రజలు జ్ఞానాన్ని పొందడంలో నేను ఒక పనిముట్టుగా ఉపయోగపడాలని అనుకోవడమే, ఆశపడటమే.
- సద్గురు జగ్గీవాసుదేవ్

వెబ్దునియా పై చదవండి