శని శింగనాపూర్ ఆలయంలో మహిళలకు ప్రవేశం.. గుడిపడ్వా కానుక!

శుక్రవారం, 8 ఏప్రియల్ 2016 (15:18 IST)
మహారాష్ట్రలోని ప్రసిద్ధ శని శింగనాపూర్ శనైశ్చరాలయంలో మహిళలకు ఎట్టకేలకు ప్రవేశం దొరికింది. గుడి పడ్వా (మహారాష్ట్రీయుల ఉగాది) సందర్భంగా మహిళలకు కూడా అధికారులు ఆలయ ప్రవేశానికి అంగీకరించారు. బాంబే కోర్టు ఇటీవల పురుషులతో సమానంగా మహిళలకు కూడా శని శింగనాపూర్ ఆలయంలో ప్రవేశం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా మహిళలకు ప్రవేశార్హత కల్పించడాన్ని గుడిపడ్వా కానుకగా ఆలయం బోర్డు పేర్కొంది.
 
ఈ నేపథ్యంలో శుక్రవారం గుడిపడ్వా పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది మంది స్త్రీ, పురుష భక్తులు శనీశ్వరుడిని దర్శించుకున్నారు. కాగా ఆలయంలో మహిళా ప్రవేశంపై భూమాత మహిళా బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ హర్షం వ్యక్తం చేశారు. నిజానికి శని శింగనాపూర్ శనైశ్చరాలయంలోకి వందల ఏళ్ళుగా మహిళలు ప్రవేశించకుండా నిషేధం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి