ఇదిలావుండగా, తనను రాయబారిగా నియమిస్తూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తూ రెహమాన్ లేఖ పంపినట్లు అసోసియేషన్ వెల్లడించింది. గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండడం గర్వకారణమని రెహమాన్ లేఖలో తెలిపారు.
కాగా, భారత్ తరపున ఇప్పటికే రియో ఒలింపిక్స్ గుడ్‌విల్ అంబాసిడర్లుగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్, ఒలింపిక్ బంగారు పతక గ్రహీత అభినవ్ బింద్రా, క్రికెట్ దిగ్గజం భారతరత్న సచిన్ టెండూల్కర్‌లు ఎంపికయ్యారు. దీనిపై స్పందిస్తూ ఒలింపిక్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా రెహమాన్‌కు సాదర స్వాగతం పలుకుతున్నామని ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా పేర్కొన్నారు.