Khairatabad: ఖైరతాబాద్ వినాయకుడి సన్నిధిలోనే ప్రసవించిన మహిళ

సెల్వి

బుధవారం, 27 ఆగస్టు 2025 (12:14 IST)
ఖైరతాబాద్ వినాయకుడి సన్నిధిలోనే ఓ నిండు గర్భిణీ ప్రసవించింది. ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి వచ్చిన ఆ మహిళకు క్యూలైన్‌లో ఉండగా పురిటి నొప్పులు రావడంతో తోటి మహిళా భక్తులు పురుడు పోశారు. ఆపై తల్లీబిడ్డలను పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించారు. 
 
ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆ మహిళను రాజస్థాన్‌కు చెందిన రేష్మగా గుర్తించారు. స్వామివారి సన్నిధిలో ప్రసవం జరగడంతో రేష్మ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 
 
మరోవైపు విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో పూజలు అందుకోవడానికి ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధం అయ్యాడు. బుధవారం వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమైనాయి. 
 
మంగళవారం నుంచి ఈ మహా గణపతి భక్తులు దర్శనమిస్తున్నాడు. దీంతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. కొందర భక్తులు బడా గణేష్ వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు