అందాన్ని అతిగా చూపిస్తే వెగటు పుడుతుంది: హన్సిక

సినిమా రంగంలో అందంగా ఉన్నవారే నిలబడగలరని హన్సిక మోత్వాని అంటోంది. అయితే ఈ అందాన్ని కూడా అందంగా చూపిస్తేనే ప్రేక్షకులను ఆకట్టుకోగలమనీ, అందంగా ఉండి కూడా ఆ అందాన్ని ప్రదర్శించటంలో విఫలమైతే ఎవరూ చూడరని తనదైన ఫార్ములా చెపుతోంది. 

కొన్ని చిత్రాలకు అందం కాస్త ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే అందాన్ని పరిమితికి మించి చూపిస్తే వెగటు పుడుతుందని కూడా చెపుతోందీ భామ. ఈ విషయాన్ని ఎప్పుడో గ్రహించానని కూడా అంటోంది. అందుకే నా పాత్రల పట్ల నిర్లక్ష్యం వహించనని చెపుతోంది.

"సీతారాముల కల్యాణం లంకలో" కూడా తన నటన బాగుంది కనుకనే ఆ చిత్రం కొత్త ఏడాదిలో అనుకున్న విజయాన్ని సాధించిందని అంటోంది.

వెబ్దునియా పై చదవండి