ఆ రెండింటిని తీర్చుకునేందుకు తపిస్తున్నా: రీమాసేన్

'చిత్రం'తో టీనేజ్ కుర్రకారు హృదయాల్లో గిలిగింతలు పెట్టిన రీమాసేన్ 'యుగానికి ఒక్కడు' చిత్రంలో హాట్ సీన్లలో కనిపించి మరోసారి వేడెక్కించింది. ఈ చిత్రం ద్వారా తను ఎప్పట్నుంచో కంటున్న కలలు కొన్నే తీరాయని చెపుతోంది. అంటే... అందులో నటించిన హాట్ సీన్లకు మించిన సెక్సీ సన్నివేశాల్లో నటించాలనా... దీనర్థం అని కొంతమంది రీమాను అడిగేందుకు సిద్ధమవుతున్నారు.

ఆ సంగతి అలా రీమాసేన్‌కు అత్యంత ఇష్టమైనవి రెండు ఉన్నాయట. అందులో మొదటిది అమెరికా అయితే రెండోది హ్యాండ్ బ్యాగులట. ఈ రెండింటినీ రీమాసేన్ పిచ్చిగా ఇష్టపడుతుందట. ఎందుకంత పిచ్చిప్రేమ అని ఆరాతీస్తే... సినిమాల్లోకి వచ్చిన దగ్గర్నుంచీ ఎలాగైనా అమెరికా వెళ్దామని రీమా ప్లాన్ చేసుకుంటూనే ఉందట.

అయితే ఏదోవిధంగా ఆ ట్రిప్ వాయిదాపడటమో లేదంటే రద్దై పోవడమో జరుగుతూ అమెరికా సందర్శన కుదరటం లేదట. అలాగే తన మనసుకు నచ్చిన హ్యాండ్ బ్యాగ్ ఇంతవరకూ తారసపడలేదట. కనుక తీరని ఆ రెండు కోర్కెలను అమితంగా ఇష్టపడుతున్నానని చెపుతోందట రీమాసేన్. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత మనం విన్నాం కానీ అందనిది ఇష్టం అని చెప్పే రీమా వ్యవహారం కాస్త విచిత్రంగా ఉంది కదూ..!!

వెబ్దునియా పై చదవండి