బక్కపిల్ల జెనీలియా కూడా లిప్-టు-లిప్ జాబితాలో చోటు దక్కించాలనుకున్నదో ఏమో గానీ, "ఛాన్స్ పే డ్యాన్స్" చిత్రంలో షాహిద్ కపూర్ పెదవులను తన పెదవులతో బిగించేసిందట. ఆ ముద్దు మత్తెక్కించి చిత్తు చేసేదిగా ఉన్నదట. దీంతో హీరో షాహిద్ కపూర్ ఆ వేడి ముద్దు సన్నివేశాన్ని చిత్రం నుంచి తొలగించాల్సిందిగా కోరాడట. చిత్రం ఏమిటంటే.. ఆ ఘాటు ముద్దుకు సెన్సార్ బోర్డు సభ్యులు అడ్డు చెప్పక పోవడం.