టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినీ కెరీర్‌పై మచ్చ..!?

WD
మహేష్‌బాబు చిత్రం రోజులతరబడి వెనక్కుపోవడంపట్ల సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌తోపాటు కృష్ణ సన్నిహితులుకూడా నిరుత్సాహానికి గురయినట్లు తెలుస్తోంది. అతిథి తర్వాత మహేష్‌బాబు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో చేస్తున్న చిత్రం గూడ్స్‌బండిలా సాగుతోంది.

దీంతో మహేష్‌బాబు కెరీర్‌పై మచ్చ ఏర్పడుతుందనీ, రకరకాల సమస్యల్లో మహేష్‌బాబు ఉన్నాడనే వార్తలు వస్తున్నాయని సోమవారం సాయంత్రం పద్మాలయలో కృష్ణను కలిసి పలువురు దృష్టికి తీసుకువచ్చారు.

శింగనమల రమేష్‌బాబు అనే నిర్మాత సరిగ్గా చిత్రాన్ని తీయలేకపోవడంతోపాటు, దర్శకుడు చొరవకూడా సరిగ్గా లేదని విమర్శలు వస్తున్నాయి.

కృష్ణ సన్నిహితులు మల్లికార్జునరావు మాత్రం ఈ విషయం వాస్తమని తెలియజేస్తూ... కొద్దిరోజులు ఓపికపట్టంది. అన్నీ సర్దుకుంటాయి. ఆ తర్వాత తానే ఓ అద్భుతమైనచిత్రాన్ని తీస్తానని వారికి హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

వెబ్దునియా పై చదవండి