త్రిష నిజంగా "మందు" కొడుతుందా...?!!

టాలీవుడ్‌లో నెంబర్‌వన్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న త్రిష అప్పుడప్పుడూ తళుక్కున వార్తల్లో కనిపిస్తుంది. అది కూడా పీకల దాకా తాగేసి ఎవర్నో ఒకర్ని గోల చేస్తూ... "ఛ" ఇదంతా నిజమేనా...? అనంటే... నిజమేనంటున్నారు. 

పార్టీలంటే ఎగిరి గంతేసే ఈ తమిళ సుందరి ఆ మధ్య తాగి రోడ్డుమీద నానా గొడవ చేస్తే పోలీసులు బతిమాలి ఆమెను ఇంటికి పంపించి వేసినట్లు అప్పట్లో తమిళ పత్రికలు రాశాయి. ఆ తర్వాత ఓ పబ్బులో పీకల్దాక తాగేసి క్రికెటర్ హేమాంగ్ బదానీపై ఫైటింగ్ చేసినట్లు కూడా ఆ పత్రికలే మరోసారి చెప్పాయి.

దీనిపై త్రిష గరంగరం అయినప్పటికీ అసలు ఈ అందాల సుందరి నిజంగా మందు కొడుతుందా...? అని ఆరా తీస్తే ఆశ్చర్యకర విషయాలు ఆమె సన్నిహితుల ద్వారా వెలికి వచ్చాయి. సాయంత్రమైతే చాలు... ఎక్కడున్నా త్రిష మందు పార్టీల్లో మునిగి తేలుతుందని ఆమెతో సినిమాలు తీసిన కొందరు దర్శక, నిర్మాతలు చెప్పారు.

కనుక త్రిష... గొడవలు పెట్టుకోవడానికి తాగిన మైకమే కారణమన్నమాట. కనుక త్రిష... నిషా త్రిషా అన్నమాట!!

వెబ్దునియా పై చదవండి