నగ్నంగా దీపికా పదుకునే ఫోజు...?

బాలీవుడ్ "ఓం శాంతి ఓం" చిత్రంతో ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న దీపికా పదుకునే 2010 సంవత్సరం క్యాలెండర్‌కోసం అందరు మోడళ్లలాగే ఓ ఫోజిచ్చింది. ఆ ఫోజును చూస్తే దీపికా నగ్నంగా ఉన్నదేమోనన్న భ్రమ కలుగుతుంది. అయితే అది నగ్న ఫోజు కాదని అర్థనగ్నమేనని దీపికా సన్నిహితులు అంటున్నారు.

దీపికా పదుకునేను తన కెమేరాలో బంధించిన ఫోటో‌గ్రాఫర్ దబ్బూ రతానీ మాట్లాడుతూ... " దీపికను కొంత వెరైటీగా చూపించాలనుకున్నా. గత ఏడాది నా క్యాలెండర్ కోసం ఆమెను సంప్రదాయ చీరకట్టులో ఫోటో తీశాను. చీరలో ఆమెను చూసినవారు దీపిక అప్సరసలా ఉందన్నారు. ఈసారి దానికి భిన్నంగా చూపించాలనుకున్నా. ఆ ఫోజును చూసినవారు రకరకాలుగా అనుకుంటున్నారు. అసలు నిజం ఏమిటో... నాకూ దీపికకు మాత్రమే తెలుసు. క్యాలెండర్‌ను పరీక్షగా చూస్తే మీకూ తెలుస్తుంది" అన్నాడు.

కాగా ఈ క్యాలెండర్లో దీపికా పదుకునేతోపాటు బిగ్ బి అమితాబ్, ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, ప్రియాంకా చోప్రా, కాజోల్, అక్షయ్ కుమార్, కరీనా, కత్రినా, సోనమ్, కంగనా రౌనత్‌లు కూడా ఉన్నారు. ఈసారి దక్షిణాది నుంచి అసిన్‌కూడా ఈ క్యాలెండర్‌లో చోటు దక్కించుకున్నది. ఈ క్యాలెండర్లో ఫోజిచ్చిన ప్రతి తార చాలా హాట్‌గా కనిపిస్తుందని దబ్బూ రతానీ చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి