నా పేరు త్రిష. ఆ పేరులోనే ప్రత్యేకత ఉంది. అదొక వరంగా భావిస్తా. కొన్ని వేల మందిని పరిశీలించినా ఆ పేరు వినిపించలేదు. అందుకే నాకు నచ్చి గుండెపై పొడిపించుకున్న నీమో ఫిష్ టాటూ నాలో చాలా ప్రత్యేకమైనది.
దానివల్ల ఎవరైనా నావైపు తిరిగి చూస్తారు. అది దిష్టి అని కొందరు అనుకుంటున్నారు. బహుశా అదికూడా బాగానే ఉంది. అలాగే నా ఎడమచేతిపై ఉన్న టారస్ టాటూ నేను మే 4న పుట్టాను అనడానికి సూచిక. నీమో, టారస్ అంటే నాకు చాలా ఇష్టం. వాటిని నా నుంచి విడదీయలేరు. కారణం... అవి పచ్చబొట్లు కదా...!