నటనకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న అక్కినేని నాగేశ్వరరావుతో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపొందే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని ఇటీవల టాలీవుడ్‌లో వార్తలు తిరుగాడుతున్నాయి. అంతేకాదు ఆ చిత్రంలో అక్కినేనిని గ్రాఫిక్స్ సహాయంతో కుర్రవాడిగా మార్చి చూపుతారనీ, ఆయన సరసన హాట్ నటి అనుష్క నటిస్తుందని కొన్ని పత్రికలు వార్తలు కూడా రాశాయి.