"బద్రి" చికిత్త అమీషా పటేల్ మళ్లీ ప్రియుడిని వదిలేసింది. తనతో జత కడుతుందేమోనని ఎన్నాళ్లగానో ఆశగా ఎదురు చూసిన బాయ్ ఫ్రెండ్ కనవ్ పురికి హ్యాండ్ ఇచ్చింది. దీంతో అతను అమీషా పేరు చెబితే మండి పడుతున్నాడు.
ప్రేమ పేరుతో తనను తనవెంట కుక్కపిల్లలా తిప్పుకుందని తన సన్నిహితుల వద్ద వాపోతున్నాడట. అమీషా తనను వదిలిపెట్టినంత మాత్రాన మజ్ను అవతారం ఎత్తబోనని వ్యాఖ్యానిస్తున్నాడట. ఆమెది "టైమ్ పాస్" ప్రేమ అని గమనించలేకపోయానని తెగ బాధపడిపోతున్నాడట.
ఇదిలావుంటే అమీషా పటేల్ మాత్రం కుటుంబ సభ్యుల ముందు ఎవరూ తనకు ఎక్కువ కాదనీ, వారికోసం ఎవరినైనా వదులుకుంటానని సెంటిమెంట్ డైలాగులు కొడుతోందట. కుటుంబ సభ్యులతో ఒకప్పుడు గెంటివేయబడ్డ అమీషా తిరిగి సొంత గూటికి చేరిన అనంతరం తనకు కొత్త శక్తి వచ్చినట్లయిందని ఎంతో సంబరపడిపోతోంది.
ప్రస్తుతం తను ఒంటరిగా, ఫ్రీ బర్డ్ అయినందున ఇక కెరీర్‌పై దృష్టి సారిస్తాననీ, దక్షిణాది సినిమాల్లో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉందని చెపుతోందట. మరి మన దర్శక నిర్మాతలు ఈ "చికిత్త"కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి మరి!!