నాకు అమ్మాయిలతో ఉండటమే ఇష్టం: షారుక్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు అమ్మాయిలతో ఫ్రెండ్‌షిప్ చేయడమంటే ఎంతో ఇష్టమట. ఇటీవల లండన్‌లో ఓ రెస్టారెంట్లో తన భార్యతోపాటు మరో పదిమంది మహిళల మధ్య షారుక్ ఒక్కడే కూచుని వారితో మహా సరదా చేస్తూ కాలక్షేపం చేశాడు. 

ఆడ స్నేహితుల గురించి షారుక్ మాట్లాడుతూ... నాకు మగ స్నేహితులు ఎక్కువగా లేరు. నాకు అమ్మాయిలతో కలసి ఉండటమంటే ఎంతో ఇష్టం. అయితే దీన్ని చూసిన కొందరు తనకు అమ్మాయిలకు మధ్య ఏదో ఉందని ఊహాగానాలు చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. అయితే నా మహిళా స్నేహితులతో మగాళ్లు పెట్టుకునే సంబంధాలు మాత్రం నాకు లేనే లేవు అని తెగేసి చెప్పాడు.

షారుక్‌కు ఉన్న ఆడ స్నేహితులలో కాజోల్, ఫరా ఖాన్, జుహి చావ్లా, రాణీ ముఖర్జీ ముఖ్యులు. వీళ్లేనా అనుకుంటే... ఇంకా చాలామందే ఉన్నారు. నిజానికి తను ఓ బిగ్ స్టార్ కావడానికి ఆడ స్నేహితులు ప్రోత్సహించినట్లుగా మగ స్నేహితులు ప్రోత్సహించలేదని చెపుతాడు షారుక్. మొత్తానికి షారుక్ ఆడ స్నేహితులందరూ మంచి మనసు కలవారన్నమాట.

వెబ్దునియా పై చదవండి