నీలి చిత్రంలో కత్రినా కైఫ్ "కేడీ" సోదరి

అక్కినేని నాగార్జున చిత్రం "కేడీ" శుక్రవారం విడుదలైంది. ఆ చిత్రంతోపాటు అదే రోజున మరొకటి కూడా ఇంటర్నెట్‌లో విడుదలైంది. అదేమిటా... అనుకుంటున్నారా..? అక్కినేని నాగార్జున సరసన నటించిన కత్రినా కైఫ్ సోదరి ఇస్బెల్లా ఖాన్ నీలి చిత్రమట. ఈ నీలిచిత్రంలో ఇస్బెల్లా ఒక యువకుడితో కలిసి రాసలీలల్లో మహా మస్తుగా విహరిస్తున్నట్లు కనిపించిందని ఇంటర్నెట్ హాట్ రాయుళ్లు వార్తలు దంచేస్తున్నారు. 

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె తాలూకు హాట్ వీడియోలు చూడవచ్చని వీరు పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసి పారేస్తున్నారు. అయితే ఇది వట్టి అబద్ధమని, పనిలేనివారు ఇటువంటి పనికిమాలిన పనికి పూనుకున్నారని కత్రినా కైఫ్ మండిపడింది. అసలు నెట్‌లో కనిపిస్తున్న అమ్మాయి తన సోదరి కాదని గొంతు చించుక అరుస్తోంది. మార్ఫింగ్ మాయాజాలంతో ఎవరో పనిగట్టుకుని ఇటువంటి బుద్ధితక్కువ పని చేశారని కేకలు వేస్తోంది.

కాగా గోవాలో ఒక వేశ్యగృహంలో ఇద్దరు విదేశీ యువతులను రక్షించే సన్నివేశం ఒకటి అక్కినేని నాగార్జున కేడీ చిత్రంలో ఉన్నది. చిత్రంగా వాళ్లిద్దరిలో ఒక యువతి నదియా ప్రస్తుతం నీలి చిత్రంలో కనిపిస్తున్న యువతిగా కొందరు చెప్పుకుంటున్నారు. మరో విచిత్రం ఏమిటంటే.. ఈ నదియా కత్రినా సోదరి ఇస్బెల్లాతో పోలి ఉండటం. అన్నిటికీ మించి లండన్ యువతులు చాలామంది ఒకరిని పోలి ఒకరు ఉన్నట్లు కనిపిస్తుంటారు. ఆ కన్ఫ్యూజన్ తెచ్చిన తంటా వల్లనే కత్రినా సోదరి నీలి చిత్రం వ్యవహారమని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి