నేను బికినీ వేసుకుంటే ప్రేక్షకులు చూడలేరు

తెలుగులో "ఒంటరి"తో ముందుకు వచ్చిన మలయాళీ నటి భావన ఆ తర్వాత మరో రెండు చిత్రాల్లో నటించి ప్రస్తుతం అజిత్ సరసన నటిస్తోంది. మళ్లీ త్వరలో తెలుగులోకి వస్తానని చెపుతూ... తాను సెక్సీ క్యాటగిరీలోకి రానని బల్లగుద్ది చెపుతోంది. 

తను బికినీలు వేసుకుని నటిస్తే ఎవరూ చూడలేరని అంటోంది. ఒకవేళ వేసుకున్నా ప్రేక్షకులు ఆదరిస్తారని కూడా కలలు లేవంటోంది. తనలో ఉన్న మంచి చెడులేమిటో తనకు బాగా తెలుసని చెపుతోంది.

దక్షిణాదిలో తెలుగు పరిశ్రమ ముందంజలో ఉంటుందనీ, అయినా అటువంటి పాత్రను తను చేయలేదని అంటోంది. భవిష్యత్‌లో కూడా అటువంటి పాత్రలలో నటించమని తనను ఎవరూ అడగరని నమ్మకముందని చెపుతోంది. అదీ చూద్దాం...

వెబ్దునియా పై చదవండి