"అదుర్స్" ఇచ్చిన విజయంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం అదుర్స్ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఇదిలావుంటే అదుర్స్ తెచ్చిన ఉత్సాహంతో మరో వండర్‌ఫుల్ సినిమా చేయాలని చిన్న ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటివరకూ కలెక్షన్లలో రికార్డు బద్దలుకొట్టిన చిత్రాన్ని మించిన సినిమాను తీయాలని జూనియర్ ఎన్టీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. అంటే... రామ్ చరణ్ "మగధీర" సృష్టించిన రికార్డును చెరిపేసి దూసుకవెళ్లాలన్న పట్టుదలలో ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలో సి.అశ్వనీదత్ 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా "శక్తి" చిత్రాన్ని చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు భోగట్టా. "మగధీర" చిత్రానికి 40 కోట్ల రూపాయలు ఖర్చైనట్లు టాలీవుడ్ ట్రేడ్ టాక్. ఈ నేపధ్యంలో ఆ చిత్రానికి మించి మరో 5 కోట్ల రూపాయలను అధికంగా ఖర్చు చేయడమే కాక, కలెక్షన్లలోనూ "మగధీర"ను మించి పోవాలన్న ధ్యేయంతో "శక్తి"వంచన లేకుండా కృషి జరుగుతున్నట్లు టాలీవుడ్ టాక్.