"ఏ మాయ చేసావె" సినిమాతోనే పెద్ద బేనర్‌లో ఛాన్స్ కొట్టేసిన సమంత వేదాంతం చెబుతోంది. "చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజీలో చదువుతున్నాను. తొలుత తమిళ సినిమా అవకాశం వచ్చింది. అక్కడ నుంచి నాగచైతన్య చిత్రానికి ఎంపిక అయ్యాను. నా పేరులో ఉన్న అర్థం ఏమిటంటే..? ప్రార్థనలను శ్రద్ధగా వినే వ్యక్తి" అని సమంత వివరణ ఇచ్చింది.
అలాగే "స్వర్గం, నరకం, విధిరాత వంటి విషయాల మీద నాకు నమ్మకం ఎక్కువ. ఎంత కష్టపడ్డా అదృష్టమన్నది తోడు కావాలన్నది నా నమ్మకం. అలాగే విధిరాతను ఎవరు తప్పించలేరు" అని సమంత వేదాంతం అల్లుకుంటూ పోయింది.
ఇంకా "అద్దం ముందు నిలబడి.. ఆల్‌దిబెస్ట్. అవార్డ్ గోస్‌టు.. సమంత అని చెప్పుకుంటాను. ఆ రోజుకోసం ఎదురుచూస్తుంటాను" అని సమంత మనసులోని మాటను బయటపెట్టింది. మరి ఆ ఛాన్స్ సమంతకు మనం కూడా కోరుకుందాం..!