శృతి హాసన్‌తో "బొమ్మరిల్లు" సిద్ధార్థ డేటింగ్..?

డేటింగ్ పేరు చెబితే మనకు బాలీవుడ్ హీరో, హీరోయిన్ల పేర్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ టాలీవుడ్, కోలీవుడ్ హీరోహీరోయిన్లు కూడా ఈ డేటింగ్ విషయంలో బాలీవుడ్ రేంజ్‌కు ఎదుగుతున్నట్లు కనబడుతున్నారు. తాజాగా కోలీవుడ్ అండ్ టాలీవుడ్ కంబైన్డ్ హీరో సిద్ధార్థ శృతిహాసన్‌తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడట. వాళ్లిద్దరి ఫ్రెండ్‌షిప్‌ను చూసిన జనం ఇద్దరి మధ్య లవ్వాట సాగుతోందని గుసగుసలు పోతున్నాయి. 

అన్నట్లు మన బొమ్మరిల్లు సిద్ధార్థ ఇంతకుముందే సోహా అలీఖాన్‌తో ప్రేమాయణం సాగించినట్లు ఆ మధ్య గుసగుసలు వినబడ్డాయి. అయితే ఆ తర్వాత సిద్ధార్థ, తనకు సోహా మంచి స్నేహితురాలనీ, అంతకుమించి తమిద్దరి మధ్య ఏమీ లేదని తెగేసి చెప్పాడు.

కానీ అనుమానం వీడని జర్నలిస్టులు నేరుగా ఇదే విషయాన్ని సోహా అలీఖాన్‌ను కూడా అడిగారు. సోహా కూడా అదే రకమైన జవాబు చెప్పడంతో పట్టుదొరక్క మిన్నకున్నారు. కానీ శృతిహాసన్‌తో సిద్ధార్థ ఫ్రెండ్‌షిప్ మాత్రం నూటికి నూరుపాళ్లు నిజమేననీ, ఆ స్నేహం ప్రేమగా మారిందనీ, ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారని వారు వాదిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టుగా వాళ్లను అడిగితే ఏం చెపుతారో మరి!!

వెబ్దునియా పై చదవండి