సల్మాన్ ఖాన్ నన్ను ఎత్తుకున్నాడు: సమీరా రెడ్డి

బాలీవుడ్ సెక్సీ నటి సమీరా రెడ్డి తన చిన్ననాటి సంగతులను ఒక్కసారి గుర్తు చేసుకుంది. బాల్యంలో అల్లరి చేస్తే తన అమ్మానాన్నలు ఎక్కడ కొడతారోనని భయపడి అల్లరి చేష్టలను అస్సలు చేసేదానిని కాదని చెపుతోంది. అయితే అప్పుడప్పుడు స్కూలు ఎగ్గొట్టి సినిమాలను చూసేదాన్నని, ఇంట్లో ఆ విషయాన్ని చెప్పకుండా దాచేందుకు ఎన్నో తంటాలు పడేదాన్నని చెప్పింది.

తన తల్లిదండ్రులు తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేవారిని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తనకు ఆరేళ్ల వయసులో తన బర్త్ డే సెలబ్రేషన్‌కు తన తండ్రి ఏకంగా సల్మాన్‌ఖాన్‌ను ఆహ్వానించారని గుర్తు చేసుకుంది. పార్టీకి వచ్చిన సల్మాన్ తనను అమాంతం ఎత్తుకుని ముద్దాడిన సంఘటన తలచుకుంటే వళ్లు పులకరించిపోతుందని అంటోంది సమీరా.

అంటే... సల్మాన్ ఖాన్ ముసలాడయ్యాడని చెపుతున్నట్లా...?

వెబ్దునియా పై చదవండి