సీక్రెట్ ప్లేస్‌లో టాటూ వేసుకున్న నమిత

బాలీవుడ్ హీరోయిన్లలో మొదలైన టాటూల పిచ్చి ఇపుడు కోలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లకు పాకింది. తొలుత చేతులు, కాళ్లపై టాటూలు వేసుకోవడం ప్రారంభించిన హీరోయిన్ల క్రమంగా వాటిని నాభిపై, ఎదపై వేసుకుంటూ కుర్రకారు దృష్టిని ఆకర్షించేందుకు పోటీ పడుతున్నారు.

ఇటీవల త్రిష, నయనతార వంటి టాప్ హీరోయిన్లు తమ ఎద సంపదపై టాటూలను ముద్రించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీంతో మిగిలిన హీరోయిన్లు కూడా వారిని డామినేట్ చేసేందుకు ఆయా ప్రాంతాల్లో ఎడాపెడా టాటూల మీద టాటూలను వేసుకున్నారు. వీళ్లందరినీ మించిన పని నమిత చేసిందని కోలీవుడ్ సినీ వర్గాలు గుసగుసలు పోతున్నాయి.

అదేంటంటే... ఎవరికీ కనిపించని సీక్రెట్ ప్లేస్‌లో నమిత టాటూ వేసుకుందని ఓ తమిళ హాట్ పత్రిక ఏకరవు పెట్టింది. "ఎవరికీ కనిపించని ప్లేసులో టాటూ వేసుకోవడమేంట"ని కొందరు హీరోయిన్లు విస్తుపోతున్నారు. ఈ సీక్రెట్ టాటూ సంగతి నిజమో కాదో నమితను అడిగితే ఏం చెపుతుందో చూడాలి మరి!!

వెబ్దునియా పై చదవండి