బోయపాటి శ్రీనుకి రామ్ చరణ్ హ్యాండిచ్చాడా?

శుక్రవారం, 30 మే 2014 (12:37 IST)
బాలకృష్ణతో 'లెజెండ్' సినిమా హిట్టుకొట్టి ఫామ్‌లోకి వచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హాండిచ్చినట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను- రామ్ చరణ్ కాంబినేషన్‌లో తాజాగా ఓ సినిమా తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం చరణ్ నటిస్తోన్న 'గోవిందుడు అందరివాడేలే' తర్వాత బోయపాటితో ఓ సినిమా చేయనున్నట్లు కథనాలు వచ్చాయి.

ఈ విషయాన్ని బోయపాటి కూడా ధృవీకరించాడు. కథ రెడీ అవుతోందనీ, 'గోవిందుడు అందరి వాడేలే' తర్వాత చరణ్ చేసే సినిమా అదే అవుతుందని కూడా ప్రచారం జరిగింది. అయితే, తాజాగా చరణ్ నుంచి వచ్చిన ప్రకటన చూస్తే బోయపాటి సినిమా ఏమైందన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే 'గోవిందుడు' తర్వాత సెప్టెంబర్ నుంచి తాను శ్రీను వైట్లతో సినిమా చేస్తున్నట్టు చరణ్ ప్రకటించాడు. దీంతో బోయపాటికి చరణ్ హ్యాండిచ్చాడా లేక శ్రీనువైట్లతో సినిమా తర్వాత బోయపాటితో చేయనున్నాడా అన్నది ఇపుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమయింది.

వెబ్దునియా పై చదవండి