'బ్రూస్లీ' డిజాస్టర్ తరువాత రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం చిత్రం 'ధృవ'. ఇందులో చరణ్ ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. తమిళ మూవీ 'తనీ ఒరువన్' ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ నటుడిగానే కాక నిర్మాతగాను ఫుల్ బిజీగా ఉన్నాడు. ధృవ సినిమాలో నటిస్తూనే మరో వైపు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఖైదీ నెం.150 సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ పనులన్నింటిని దగ్గరుండి చూసుకుంటున్నాడు.
అయితే ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా రామ్ చరణ్ తన ఫ్యామిలీతో చాలా సరదాగా గడుపుతున్నాడు. ఎప్పుడు మెగా ఫ్యామిలీతో అల్లరిగా ఉండే రామ్ ఈ సారి తన అత్తారింటి ఆడవాళ్ళతో సరదాగా గడిపాడు. అలా సరదాగా గడుపుతున్నప్పుడు ఓ సెల్ఫీ కూడా దిగారు. ఈ సెల్ఫీలో ఉపాసన, తన మదర్, సిస్టర్స్ కూడా ఉన్నారు. అయితే ఈ ఫోటోని ఉపాసన తన అఫీషియల్ పేజ్‌లో పోస్ట్ చేస్తూ రామ్.. మామ్.. మై సిస్టర్స్.. సర్‌ప్రైజ్ సెల్ఫీ అంటూ ఓ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.