మరోసారి పీకల్లోతు ప్రేమలో ఆర్తీ అగర్వాల్

సినిమాలపైన ఉన్న మోజుకొద్దీ భర్తను వదిలేసి టాలీవుడ్‌కు చేరిన ఆర్తీ అగర్వాల్ తాజాగా విలన్ పాత్రల్లో నటించే ముకుల్ ఆనంద్‌తో రొమాన్స్ సాగిస్తోందని టాలీవుడ్ కోడై కూస్తోంది. అంతేకాదు ముకుల్ ఆనంద్ నివాసముంటున్న ముంబయికు తన మకాన్ని మార్చేసిందని కూడా అంటున్నారు. 

ముంబయిలో అయితే తమ ప్రేమకు అడ్డూఆపు ఉండదన్న యోచనలో ఆర్తీ బాలీవుడ్ చెక్కేయడానికి సిద్ధమైందని చెపుతున్నారు. ముకుల్ ఆనంద్- ఆర్తీల మధ్య చిగురించిన ప్రేమ ఫలితమే నీలవేణి చిత్రంలో లిప్ టు లిప్ కిస్ అని టాలీవుడ్ సినీజనం అంటున్నారు.

దీనికి బలాన్ని చేకూర్చే విధంగా ఆర్తీ అగర్వాల్ ముకుల్ ఆనంద్‌తో కలిసి లేట్‌నైట్ పార్టీలకు వెళ్లి వస్తోందట. ఈ విషయం ఆర్తీ తండ్రికి తెలియడంతో ఇంట్లో పెద్ద గొడవ కూడా జరిగిందట.

వెబ్దునియా పై చదవండి