టాలీవుడ్ పునర్జన్మల కథలవైపు పరుగులు తీస్తుంటే హాలీవుడ్ చిత్ర పరిశ్రమేమో భవిష్యత్‌పై సినిమాలు తీసుకుంటూ పోతోంది. తాజాగా తమిళ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న రోబో కూడా హాలీవుడ్ తరహాలోనే భవిష్యత్‌లో స్టార్ట్ అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే శంకర్ మాత్రం ఈ సినిమా వర్తమానాన్ని కూడా తెలియనీయకుండా గోప్యంగా చిత్రీకరిస్తున్నారు.