అ.. ఆ.. సినిమాలో సమంత కొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తుందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. 24లో ఓల్డ్ యాక్షన్‌తో గుర్తింపు సంపాదించలేకపోయిన సమంతకు మంచి హిట్ ఇవ్వాలని త్రివిక్రమ్ చెప్తున్నాడు. త్రివిక్రమ్‌తో మూడోసారి ముచ్చటగా నటించనున్న ఈ ముద్దుగుమ్మ.. స్టైల్ మార్చిందని తెలిసింది. అ. ఆ.. సినిమాలో తొలిసారిగా తాను కామెడీ ప్రయత్నించానని.. టైమింగ్ బాగానే వచ్చిందని సమంత చెప్పుకొచ్చింది.
యాక్షన్.. రియాక్షన్ల విషయంలో కొత్తదనం కోసం ప్రయత్నించానని చెప్పుకొచ్చింది. అందుకే ఈ సినిమాపై కాన్ఫిడెన్స్ చాలా పీక్స్‌లో ఉంది. ఈ సినిమాతో కనుక హిట్టు కొట్టిందంటే.. అమ్మడు రేంజు ఎక్కడికో వెళ్లిపోతుందని సినీ జనం అంటున్నారు. ప్రస్తుతానికైతే ఆన్ లైన్ బుకింగులు సినిమాపై ఏ రేంజు క్రేజ్ ఉందో చూపిస్తున్నాయి. వీటన్నింటినీ ఫస్ట్ డే టాక్‌తో ప్లస్ పాయింట్లుగా మలుచుకోవాలని సినిమా యూనిట్ భావిస్తోంది.