పెద్ద నోట్ల రద్దు వల్ల చాలా బిజినెస్‌లు మందకొడిగా సాగడం చూస్తూనే వున్నాం. చాలా చోట్ల మార్కెట్లు బోసిబోతున్నాయి. అందులో భాగంగానే సినిమాలు పెద్దగా ఆడటంలేదు. జనాలు రావడంలేదు. ఈ విషయాన్ని ఇటీవలే పలువురు నిర్మాతలే వెల్లడించారు. కొత్తగా సినిమాలు తీసే నిర్మాతలు ముందుకు రావడంలేదు. కాగా, నిఖిల్ నటించిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం మంచి టాక్‌నే తెచ్చుకుంది.
ఇదిలావుండగా.. ఇటీవలే విడుదలై విజయ్ అంటోని.. బేతాళుడు చిత్రం కూడా అనుకున్నంతగా ఆడలేదు. పెద్దనోట్ల రద్దువల్ల సినిమాలు వాయిదాపడి ఆఖరికి గత్యంతరంలేని స్థితిలో విడులైంది. బిచ్చగాడు వున్న వూపుతో.. బయ్యర్లు ఎక్కువపెట్టి కొనుగోలు చేశారు. కానీ. అనుకున్నంత రాలేదు. దాంతో.. దాదాపు 3 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అందరూ విజయ్ ఆంటోని విన్నవించగానే.. ప్రమోషన్‌గా హైదరాబాద్ వచ్చారు. కానీ అనుకున్నంత లాభం లేకపోవడంతో.. థియేటర్లలో సినిమాను ఎత్తివేయాల్సి వచ్చింది. కాగా, ఇప్పుడు ధృవ సినిమా విడుదలయింది. అయినా.. థియేటర్లలో ఆశించినంతగా జనాలు ఇరగబడే విధంగా లేకపోవడంతో.. ఎగ్జిబిటర్లు డైలమాలో వున్నట్లు తెలుస్తోంది.