నేను పాసయిపోయాను: చిరంజీవి

శనివారం, 3 అక్టోబరు 2015 (10:46 IST)
ఏడెనిమిది ఏళ్ళ తర్వాత కెమెరాముందుకు వస్తున్నా కాబట్టి.. ఎలా కనిపిస్తానో అని టెన్షన్‌ నాలో వుంది. తొలిషాట్‌ పూర్తయ్యాక.. మోనిటర్‌లో చూసుకున్నాక.. 'పర్వాలేదు పాసైపోయాను' అనిపించిందని'' చిరంజీవి అన్నారు. మనోజ్‌ పరమహంస నన్ను అందంగా చూపించాడు.

ఆయనకు థ్యాంక్స్‌ అంటూ... చెప్పారు. రామ్‌చరణ్‌ నటించిన 'బ్రూస్‌లీ' ఆడియో వేడుక హైటెక్స్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిత్రంలో పనిచేసిన వారంతా మాట్లాడాక.. చిరంజీవి మాటకోసం ఎదురు చూశారు. అయితే ఈసారి పవన్‌కళ్యాణ్ కోసం అభిమానులు గొడవచేయకపోవడం విశేషం.
 
శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి అతిథిపాత్రలో నటిస్తున్నాడు. సీడీని చిరంజీవి ఆవిష్కరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ... దర్శకుడు, రచయితలు గోపీమోహన్‌, కోన వెంకట్‌ బలవంతం చేయడంతో నటించాల్సి వచ్చింది. ఒక పక్క 150 సినిమా చేయాల్సివుంది. ఇది అవసరమా? అని అడిగాడు. ఇది 150వ సినిమాకు టీజర్‌లా వుంటుందని బలవంతం చేశారు. అభిమానులు ఎదురుచూస్తున్న సమయం కూడా ఇప్పుడే వచ్చిందనినిపించింది. ఇందులో అభిమానులకోసం డైలాగ్స్‌ వున్నాయి. అవన్నీ అద్భుతంగా రాశారు.
 
అభిమానులే నాకు ఫ్యూయల్‌.... చిరు
రామ్‌చరణ్‌ నాతో అంటాడు... బాస్‌.. మీ స్టామినా మ్యాచ్‌ చేయడం, మీ స్పీడ్‌ని క్యాచ్‌ చేయడం ఎవరివల్లా కాదు..' అంటాడు. నేను.. నా స్టామినాకీ, నా స్పీడుకీ ఫ్యూయల్‌ అభిమానులే. మన అభిమానులు మన కోసం ఎదురుచూస్తున్నారు. వెళ్ళాలి బై.. అంటూ నేను డైలాగ్‌ చెబుతాను అన్నారు. దాంతో ఒక్కసారిగా అభిమానులు కేరింతలు కొట్టారు.
 
భార్య జేబు చూస్తుంది: చిరు
ఇక రామ్‌చరణ్‌ సినిమా చేసి ధన్యుడ్ని అయినట్లుపించింది. దీక్షలా చేశాడు. అందరూ కష్టపడ్డారు. అలసిపోయి ఇంటికి వస్తుంటాడు. తనని చూసి వాళ్ళ అమ్మ.. ఇంత కష్టం అవసరమా? అంది.. అప్పుడు చరణ్‌.. డాడీ కష్టాన్ని చూసిన నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? అని తేల్చేశాడు. అప్పుడు నేను జోక్‌గా ఇలా అన్నాను... భార్యగా భర్త కష్టపడి వస్తే.. ఎంత పేవ్‌మెంట్‌ తెచ్చాడనేది చూసేది అప్పుడు. ఇప్పుడు తల్లిగా కొడుకు కష్టాన్ని పెయిన్‌లా భావిస్తుందని... చెప్పాను. అని నవ్వించారు. 
 
చరణ్‌కు చిరంజీవినే పోటీ.. అరవింద్‌
అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్‌కి రామ్‌చరణ్‌ మగధీరుడు. దినదినాభివృద్ధి చెందుతూ ఇంత ఎత్తుకు ఎదిగాడు. చరణ్‌కి చిరంజీవి గానే పోటీ.. చిరంజీవిగారు ఇందులో తళుక్కున మెరుస్తారు. అన్నారు. 
 
అక్కతమ్ముడు స్టోరీ: రామ్‌చరణ్‌
అక్క, తమ్ముడు మధ్య సాగే కథ ఇది. అక్క పాత్రలో కృతి చేసింది. వారం క్రితమే నాన్నగారితో చిత్రీతకరణ పూర్తిచేశాం. ఆయనతో తొలిషాట్‌ చేసినప్పుడు నా గుండెల్లో వంద గుర్రాలు పరిగెట్టినట్లు అనిపిచిందని చెప్పారు. ఇంకా శ్రీనువైట్ల, తమన్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ తదితరులు మాట్లాడారు.

వెబ్దునియా పై చదవండి