విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

దేవీ

శనివారం, 19 జులై 2025 (17:47 IST)
Vijay Sethupathi
డైరెక్టర్ పూరి జగన్నాథ్, యాక్టర్ విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ #పూరిసేతుపతి. ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్‌ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త కథానాయికగా నటిస్తోంది. 
 
ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభించింది. ఇందులో విజయ్ సేతుపతి అడుక్కునే వాడిగా నటిస్తున్నారు. తాజా సమాచారం మేరకు హైదరాబాద్ శివార్లో అల్యూనియం ఫ్యాక్టరీ లో వేసిన సెట్ లో ఆయనపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి పాత్ర వైవిధ్యంగా వుంటుందట. ఈ సినిమాలో విలన్ గా దునియా విజయ్ నటిస్తున్నాడు. విలన్ పట్టుకునేందుకు విజయ్ సేతుపతి బెగ్గర్ గా యాక్ట్ చేసి బెగ్గర్ గుంపులో వుంటాడని తెలుస్తోంది. దీనిని బట్టి సేతుపతి పాత్ర పోలీసా? కాదా? అనేది ఇంకా తెలియాల్సి వుంది. దర్శకుడు ఈసారి విజయ్ సేతుపతిని సరికొత్తగా చూపించనున్నాడు.  టబు, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,హిందీ ఐదు భాషలలో విడుదల కానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు