ఐదు భాషల్లో పుష్ప తొలి సింగిల్ సాంగ్ దాక్కో దాక్కో మేక

సోమవారం, 2 ఆగస్టు 2021 (16:43 IST)
Devi Sri Prasad
అల్లు అర్జున్, సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే చాలు అభిమానులు ఊగిపోతారు. ఈ కాంబినేషన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఈ ముగ్గురు పేర్లు ఒక పోస్టర్ పై కనిపిస్తే థియేటర్ బయట జనాలు డాన్స్ చేస్తారు. సుకుమార్, అల్లు అర్జున్, దేవి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఆగస్టు 13న ఐదు భాషల్లో పుష్ప తొలి సింగిల్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.
 
ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడబోతున్నారు. తెలుగులో శివం. హిందీలో విశాల్ దడ్లాని.. కన్నడంలో విజయ్ ప్రకాష్. మలయాళంలో రాహుల్ నంబియార్. తమిళంలో బెన్నీ దయాల్.. దాక్కో దాక్కో మేక పాటను ఆలపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. రెండు భాగాలుగా పుష్ప సినిమా రానుంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు