వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో రాంగోపాల్ వర్మకు మించినవారు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. సమయం చూసుకని చక్కగా ట్విట్టర్లో ట్వీటులు ఇచ్చుకుంటూ వెళుతుంటాడు. ఇదివరుక ఏదైనా చెప్పాలంటే మీడియా ముందుకు వచ్చి, మరీ చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడదేమీ లేకుండానే చక్కగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చెప్పాల్సింది చెప్పేసి ముసుగుతన్ని హాయిగా నిద్రపోవచ్చు. ఆ తర్వాత పొద్దున్నే లేచి చూసుకుంటే ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు... మరెంతమంది అనుకూలంగా ఉన్నారో చూసుకోవచ్చు. ఇంతకీ ఈసారి రాంగోపాల్ వర్మ ఏమని ట్వీటాడో తెలుసా.
పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని బాలీవుడ్ ఇండస్ట్రీలో హీందీలో విడుదల చేసి తెలుగు ఇండస్ట్రీ పరువు తీసారంటూ మండిపడ్డారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు సినీ పరిశ్రమకు ఒక పరువు, మర్యాద, గౌరవం ఉన్నాయనీ... అవన్నీ పవన్ కళ్యాణ్ తన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంతో తీసి పారేశారంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.