అసలు వాస్తు శాస్త్రాన్ని నమ్మొచ్చా?

బుధవారం, 14 మే 2014 (12:33 IST)
File
FILE
వాస్తు అనగానే చాలామందికి విభిన్న రకాలైన ఆలోచలు, అభిప్రాయాలు ఉంటాయి. ఏది కోరుకుంటే అది జరుగుతుందనే ఆలోచన మదిలో కలుగుతుంది. ఈ మానవ సమాజంలో ఓ సూత్రం ఉంది. ఏదీ తనకు తానుగా సిద్ధించదు. అనుకున్నది ఏదీ అందకుండా పోదు. కొంచెం తిరకాసుగా వున్న సత్యసూత్రం ఇది.

ఇష్టదైవాన్ని దర్శనం చేసుకునేందుకు వెళ్లే భక్తునికి కావాల్సింది మనసులో సంకల్పం. కేవలం సంకల్పంతోనే అది జరగదు. అది కార్య రూపంగా మారడానికి చిన్న ప్రణాళిక అనేది ముఖ్యం. ఆ ప్రణాళికలో భాగంగా మనలను గమ్యస్థానానికి చేర్చేందుకు ఓ వాహనం అవసరం. ఆ వాహనమే లేకుంటే మన ప్రణాళిక నెరవేరదు.

అలాగే, వ్యక్తుల మధ్య, దేశాల మధ్య నిరంతరం కమ్యునికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసేది సెల్‌ఫోన్. ఇవి రెండు లక్ష్య స్వరూపాలు కావు. కాని లక్ష్యసాధనకు మార్గాలు. వాస్తు అలాంటిదే. మనిషి మహోన్నత అభివృద్ధికి, మానసిక, ఆరోగ్య సమృద్ధికి ఇల్లు అనే వాహనం ప్రకృతి శక్తి అనే పెట్రోలు పోసుకొని తనకు తాను స్వయం శక్తులతో ఋతువులను, కాలాన్ని, సమన్వయ పరచుకొని మన మనస్సును ప్రశాంత పరుస్తూ కర్తవ్యం వైపు నడిపించేదే వాస్తు.

వెబ్దునియా పై చదవండి