కిరణ్ బేడీ విజయాలకు ప్రతిరూపం

బుధవారం, 9 జనవరి 2008 (13:19 IST)
తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా పోలీసు శాఖలో అడుగిడిన కిరణ్ బేడి సాధించిన విజయాలకు ప్రతిరూపంగా ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. ఆమె కెరీర్‌లో ఒడిదుడుకులను అవలీలగా ఎదుర్కొని.. సమాజ శ్రేయస్సుకు ఆమె చేసిన కృషికి, అత్యున్నత సేవలకుగాను దేశంలోనే గాక అంతర్జాతీయంగా ఆమె కీర్తి ప్రతిష్టలను గడించారు.
ఆమె సాధించిన అవార్డులు...

1979లో ప్రెసిడెంట్ గాలంట్రీ అవార్డు
1980లో ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
1991లో మాదకద్రవ్యాల నిరోధకత మరియు నియంత్రణ (ఆసియా ప్రాంతానికి) అవార్డు
1994లో మెగసాసే అవార్డు.
1995లో మహిళా శిరోమణి అవార్డు.
1995లో ఫాదర్ ముచిస్మౌ హ్యుమానిటేరియన్ అవార్డు.
1995లో లయన్ ఆఫ్ ద ఇయర్.
1997లో జోసెఫ్ బీయుస్ అవార్డు
1999లో ప్రైడ్ ఆఫ్ ఇండియా
2005లో సమాజ సమానత్వంపై మథర్ థెరీసా మెమోరియల్ నేషనల్ అవార్డు.

వెబ్దునియా పై చదవండి