పాప్ సంగీత రేరాణి బ్రీట్నీ స్పియర్ పునరామనం

సోమవారం, 22 సెప్టెంబరు 2008 (18:07 IST)
FileFILE
మృత్యు ముఖంలోంచి తప్పించుకుని బతికి బయటపడి వచ్చిన పాప్ సంగీత రాణి బ్రీట్నీ స్పియర్ తాజాగా రూపొందించిన ఆల్బమ్ 'సర్కస్' ఇంకా విడుదల కాకముందే దానిలోని ఉమనైజర్ పాట ఇంటర్నెట్‌లో లీకైపోయింది.

మాదకద్రవ్యాల సేవనంలో మునిగి తేలి మృత్యువు దరిదాపులకు పోయి వచ్చిన బ్రీట్నీ ఇటీవలే చికిత్సలు ముగిసి క్షేమంగా బయటపడిన విషయం తెలిసిందే. కొత్తగా ఆమె రూపొందించిన సర్కస్ ఆల్బమ్‌లోని ఉమనైజర్ అనే పాటలో కొంత భాగాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు.
పాప్ సంగీత దివ్య రాణి బ్రీట్నీ
  పడిలేచే కడలి తరంగానికి తాజా ప్రతీక బ్రీట్నీ స్పియర్. పాతికేళ్ల వయసులోనే తారాజువ్వలా ఎదిగి, ఆ కీర్తిప్రతిష్టల పర్వత భారాన్ని మోయలేక మాదకద్రవ్యాల మత్తులో మునిగి జీవితం అంచులదాకా పోయి తిరిగివచ్చిన ఈ పాప్ రేరాణికి పాప్ సంగీతం తిరిగి పట్టం కట్టనుందా...!      


ఈ రోజు -సెప్టెంబర్ 22- మార్కెట్లో విడుదల కానున్న ఈ పాట తన కెరీర్‌లో రూపొందించిన ఉత్తమ అల్బమ్‌గా బ్రీట్నీ పేర్కొంది. దీనిలోని ఉమనైజర్ పాట మరీ రెచ్చగొట్టే ట్యూన్‌తో ఉందని భావిస్తున్నారు.

ఆబ్బాయీ ముందుకు రావడానికి ప్రయత్నించకు.. నీకేం జరుగుతుందో నాకు తెలుసు.. అంటూ సాగే ఈ పాటను బ్రీట్నీ పాడగా దీంట్లో మొత్తం 60 లిరిక్స్ ఉన్నాయని ఓ వెబ్‌సైట్ చెబుతోంది.

పాప్ రేరాణి పునరాగమనాన్ని తిరిగి చాటి చెప్పే ఈ ఆల్పమ్‌ను ఆమె 27వ జన్మదినమైన డిసెంబర్ 2న విడుదల చేయనున్నారు. ఇటీవలే ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డుల ఉత్సవంలో మూడు ట్రోఫీలను -వీడియో ఆఫ్ ది ఇయర్, ఉత్తమ మహిళా వీడియో, ఉత్తమ పాప్ వీడియో- బ్రీట్నీ స్పియర్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి