వృద్ధాప్యంలోను అరుదైన రికార్డు

గురువారం, 15 నవంబరు 2007 (18:31 IST)
లండన్‌కు చెందిన డెరీన్ అనే 84 ఏళ్ళ వృద్ధురాలు 10,000 అడుగుల ఎత్తునుంచి దుమికి కొత్త రికార్డు సృష్టించింది. వృద్ధాప్యాన్ని తేలిక భావించే పలువురిని ఈ సాహసం ఆశ్చర్యచకితులను చేసింది. వృద్ధాప్యులను ఆదుకుని వారి సంరక్షణకై పాటుపడే లండన్ ప్రనోన్టర్ కేర్ అనే సంస్థ... కేంద్ర అభివృద్ధికి 3వేల పౌండ్ల ఆర్థికసాయాన్ని సేకరించేందుకు తీర్మానించింది.

అయితే ఈ నిధుల సేకరణకు విభిన్న మార్గాన్ని పాటించింది. నిధుల కోసం 84ఏళ్ళ వృద్ధురాలిని పదివేల అడుగుల ఎత్తు నుంచి దుమికి రికార్డు సృష్టించదలచింది. దీని ప్రకారం నేత్రవాన్ వైమానిక దళం నుంచి సైనిక విమానం ద్వారా పదివేల అడుగుల ఎత్తుకు డెరీన్ తీసుకెళ్ళి... అక్కడ నుంచి స్కై ఫోర్స్ వీరుని వెంటబెట్టి 120 మీటర్ల వేగంతో నింగి నుంచి నేలకు దుమికింపజేసింది.

నేలకు చేరుకున్న డెరీన్ సాహసాన్ని మెచ్చి పలువురు ఆమెను ఘనంగా ఆహ్వానించారు. ఈ విషయమై డెరీన్ విలేకరులతో మాట్లాడుతూ... ఇటువంటి సాహసంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. వృద్ధులకు ఆర్థిక సాయం అందించేందుకు ఇలాంటి సాహసం చేయడంలో తమకు గొప్పగా ఉందని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి