సెయింట్ అల్ఫోన్సాగా మారిన సిస్టర్ అల్ఫోన్సా

FileFILE
మానవజాతి మొత్తానికి అందించగలిగేంత ప్రేమానురాగాలను హృదయం నిండా నింపుకోవడంలో సిస్టర్ అల్ఫోన్సా విజయ సాధించింది. సిస్టర్ అల్ఫోన్సా ప్రపంచం ఇంతవరకూ కనీ వినీ ఎరుగని మహిళగా క్రైస్తవుల చేత పూజించబడుతోంది. జీసస్ నిజమైన అనుచరురాలిగా సిస్టర్ అల్ఫోన్సా ప్రేమామృత కాంతిపుంజంగా జీవితం గడిపింది.

గుండెనిండా ప్రేమ భావానికి ఆమె ఒక లైట్ హౌస్‌గా ఉండేది. ఏ మాత్రం అలసట అనేదే లేకుండా ఆమె పగలు రేయి క్రీస్తు పూజలో గడిపింది. అతి సాధారణమైన, స్వచ్ఛమైన హృదయం కలిగిన సన్యాసిని దేవుడితో నిత్య సంభాషణలో ఉంటూ ప్రభువు హృదయాన్ని చూరగొనింది. తన అవిరళ కృషితో ఆమె చివరకు దేవుడి పీఠాన్ని రూపొందించి ఆయనను విరామం లేకుండా సేవిస్తూ గడిపింది.

1910 ఆగస్టు 19న కేరళలోని కుడుమలూరులో జోసెఫ్, మేరీ దంపతులకు నాలుగో బిడ్డగా జన్మించిన అల్ఫోన్సా విధివశాత్తూ మూడో నెల నిండగానే తల్లిని కోల్పోయింది. బాల్యంలో ప్రాథమిక విద్యను నివాస ప్రాంతానికి దగ్గరగానే పూర్తి చేసిన అల్ఫోన్సా లీసెక్స్‌లోని సెయింట్ లిటిల్ థెరెస్సా బాటలో సన్యాసినిగా మారాలని నిర్ణయించుకుని వివాహానికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వచ్చింది.

అయితే వివాహంపట్ల ఆమె వ్యతిరేకతను పట్టించుకోని కుటుంబం ఆమెను నిశ్చితార్థానికి బలవంతం చేసింది. అయితే పట్టు వీడని అల్పోన్సా మండుతున్న పొయ్యిలో కాలు పెట్టి తనను తాను కాల్చుకుంది. దీంతో కుటుంబం ఆమె వివాహ ప్రయత్నాలను ఆపి కాన్వెంట్‌లో చేర్చింది.

1927లో పెంటాకోస్ట్ పండుగ సందర్భంగా ఆమె భరనంగనంలోని క్లారిస్ట్ కాన్వెంట్‌లో చేరింది. 1928 ఆగస్టు 2న ఆమెకు అల్ఫోన్సా అని పేరు పెట్టారు. 1930 మే 19న ఆమె మతపర కార్యకలాపాలలోకి దిగింది. ఇలా మతంలోకి తీసుకున్నాక ఆమెను ఉన్నత విద్యకోసం ఉన్నత చంగనచెర్రీకి పంపారు. ఆమె చనిపోయాక ఆ స్కూలుకు ఆమె పేరునే ఖరారు చేశారు. ఆ స్కూలులో ఆమె ఒక సంవత్సరం పాటు టీచర్‌గా పనిచేసింది.

FileFILE
20వ శతాబ్దంలో జీవించిన సిస్టర్ ఆల్ఫోన్సా హోలీ సీచే గుర్తించబడి గౌరవించబడింది. ప్రపంచంలోని సంపద, సౌభాగ్యం పట్ల ఏమాత్రం మరులు గొనని దీక్షతో ఆమె పవిత్ర సన్యాసినిగా కాలం గడిపింది. తన దురదృష్టం గురించి ఆమె ఏ మాత్రం బాధపడలేదు. దివ్యమైన దార్శనికతతో ఆమె ప్రతి విషయాన్నీ విశాల దృక్కోణం నుంచి అంచనా వేస్తూ వచ్చేది.

ఆమె జీవితం స్వల్పకాలంలోనే ముగిసింది. 1946 జూలై 28న 36 ఏళ్ల స్వల్ప ప్రాయంలోనే ఆమె పరమపదించింది. ఆమె సాధారణమైన జీవితం గురించి చాలా కొద్దిమందికే తెలుసు అంటే ఆశ్చర్యపడనవసరం లేదు. ఆమె పవిత్రత గురించి తెలిసిన స్కూలు పిల్లలు, ఇతరులు ఆమెకు దివ్యత్వం పొందగల అర్హత ఉందని ప్రచారం ప్రారంభించారు. దేవుడు ఆమె సేవలను గుర్తించడం మొదలైంది.

1953 డిసెంబర్ 2న ఆమె బీటిఫికేషన్ ప్రక్రియను హెచ్ ఇ కార్డనల్ టిసెరాంట్ ప్రారంభించారు. చివరకు 1984 నవంబర్ 9న దివంగత పోప్ జాన్ పాల్ 2 ఆమె క్రిస్టియన్ విలువలను ధీరోధాత్తంగా ఆచరించిందని అధికారికంగా ఆమోదించడంతో ఆమె సెయింట్‌హుడ్‌కు చేరువైంది.

ఆమె ప్రదర్శించిన మహిమను కూడా పరిశీలించి పోప్ జాన్ పాల్ 1985 జూలై 6న లాంఛన ప్రాయంగా ఆమోదించారు. ఈ అక్టోబర్ 12న వాటికన్ ఆమెకు సెయింట్ హుడ్ ప్రకటించనుండటంతో ఆమె దివ్యత్వం కోసం 55 ఏళ్లుగా జరుగుతూ వచ్చిన మహా కృషి చివరకు ఫలించినట్లయింది.

ఆమె పేరు ప్రతిష్టలున్న వ్యక్తి కాదు. ప్రపంచం దృష్టిలో పడిన ఎలాంటి మహత్కార్యాన్ని ఆమె చేయలేదు. జీవితం మొత్తంగా ఆమె వ్యాధిగ్రస్తురాలిగా భరనంగనం కాన్వెంట్‌లోని గదిలో దైవ ప్రార్థన చేసుకుంటూ గడిపింది.

కేరళకు, భారతదేశానికి సంబంధించిన పురాతన క్రైస్తవ కమ్యూనిటీకి చెందిన ఈ మట్టిబిడ్డను తరతరాలు కూడా గుర్తుంచుకునేలా పోప్ జాన్ పాల్ 2 మన దేశాన్ని 1986 ఫిబ్రవరి 8న సందర్శించిన సందర్భంగా అల్ఫోన్సా బీటిఫికేషన్‌ను ప్రకటించారు. క్రీస్తు అనుంగు శిష్యురాలిగా ఆమెను అధికారికంగా ప్రకటించారు.