అమెరికాకు చెందిన "ఫోర్బ్స్" పత్రిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది. అందులో ప్రముఖ శీతల పానీయాల తయారీ కంపెనీ "పెప్సికో" ఛైర్మన్ మరియు సీఈఓ అయిన ప్రవాస భారతీయురాలు ఇంద్రనూయీ మూడో స్థానం దక్కించుకున్నారు.
భారత మహిళలు ముగ్గురే...!
ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన మొదటి పదిమంది అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఆరుగురు అమెరికాకు చెందినవారు కాగా... ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్ దేశాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఇక, మొత్తం వందమందిలో భారత మహిళలు... సోనియా, మాయావతి, కిరణ్ మజుందార్ షాలు...
ఇంకా కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి సోనియాగాంధీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. కాగా, గత సంవత్సరం ఆరో స్థానంలో నిలిచిన సోనియా ఈసారి 21వ స్థానంలో నిలవగా, మాయావతి 59వ స్థానంలో నిలిచారు. వీరితో పాటు బయోకాన్ అధినేత్రి కిరణ్ మజుందార్ షా కూడా 99 స్థానాన్ని సంపాదించుకున్నారు.
పెప్సికో 39 బిలియన్ డాలర్ల ఫుడ్ అండ్ బేవరేజ్ దిగ్గజంగా అభివృద్ధి చెందేందుకు ఇంద్రానూయీ కృషి ఎంతగానో ఉన్నట్లు ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. అంతేగాకుండా కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, రష్యా జ్యూస్ దిగ్గజం లెబెడియాన్ స్కైలో 75 శాతం వాటాను దక్కించుకునేందుకు నూయీ చేసిన కృషిని ఆ పత్రిక కొనియాడింది.
కాగా, జర్మనీ ఛాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్, రెండో స్థానాన్ని అమెరికాకు చెందిన ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ షెలియా సి బెయిర్ దక్కించుకున్నారు. ఇంకా ఈ జాబితాలో హిల్లరీ క్లింటన్ 28వ స్థానంలోను, టెలివిజన్ కార్యక్రమం ద్వారా ప్రపంచ ప్రజలందరికీ సుపరిచితురాలైన ఓఫ్రా విన్‌ఫ్రీ 36 స్థానంలో, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భార్య మెలిండా 40వ స్థానంలోనూ, లారా బుష్ 44వ స్థానంలో, బ్రిటన్ రాణి ఎలిజబెత్ 58వ స్థానంలోనూ నిలిచారు.
ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన మొదటి పదిమంది అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఆరుగురు అమెరికాకు చెందినవారు కాగా... ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్ దేశాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఇక, మొత్తం వందమందిలో భారత మహిళలు... సోనియా, మాయావతి, కిరణ్ మజుందార్ షాలు ముగ్గురు మాత్రమే...!
వ్యాపార రంగానికి చెందిన మహిళల విషయానికి వస్తే... జిరాక్స్ అధినేత ఆన్ మల్కాహీ, ఒరాకిల్ ప్రెసిడెంట్, సీఎఫ్ఓ శాఫ్రా ఏ కాజ్, హ్యూలెట్ పాకర్డ్ ఉన్నతాధికారి ఆన్ లివ్‌మోర్‌లు పై జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.