మహిళల కోసం సఖి బస్సులు : యూపీ

గురువారం, 22 మే 2008 (14:18 IST)
మహిళా ప్రయాణీకుల సౌకర్యార్ధం సఖి పేరిట ప్రత్యేక బస్సులను లక్నోలో ఉత్తర ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్ఆర్టీసీ) ప్రారంభించింది. ఉద్యోగాలు, చదువుల కోసం వెళ్లే మహిళల కోసం ఈ బస్సులు ఏర్పాటు చేశామని యూపీ రవాణా శాఖ మంత్రి రామ్ అచల్ రాజ్బీర్ చెప్పారు.

సఖి బస్సులలో మహిళా కండక్టర్‌తో పాటుగా డ్రైవర్ కూడా ఉంటారని తెలిపారు. సాధారణ బస్సులలో వసూలు చేసే ఛార్జీలే ఈ బస్సుల్లో కూడా వర్తిస్తాయని వివరించారు. సఖి బస్సులు ఉదయం 09.30 ని.ల నుంచి సాయంత్రం .5.30 ని.ల వరకు నడుస్తాయని రాజ్బీర్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి