సంపదలనొసగే అక్షయ తృతీయా

మంగళవారం, 6 మే 2008 (17:31 IST)
WD
పవిత్రమైన తిథులలో అక్షయతృతీయ ఒకటి. ఇది వైశాఖ మాసంలో వస్తుంది. అంటే ఈ నెలలో 8వ తేదీన రానున్న ఈ పండుగ సందర్భంగా బంగారు నగల వ్యాపారులు మహిళలను ఆకర్షించటానికి రకరకాలు స్కీములను ప్రకటిస్తున్నారు. అక్షయతృతీయాకి బంగారు నగలకి సంబంధం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా...? ఈ రోజున బంగారు నగలు కొనుగోలు చేసిన మహిళల ఇంటికి సంపద తరలివస్తుందని నమ్మకం. ఈ విశ్వాసంతోనే గత ఏడాది 200 కిలోగ్రాముల బంగారు ఆభరణాలను మన రాష్ట్రంలోని మహిళలు కొనుగోలు చేశారు. ఈసారి దీనికి మించిన అమ్మకాలను జరపాలని నగల షాపుల యజమానులు భావిస్తున్నారు.

నగల కొనుగోళ్ల సంగతి అలా ప్రక్కనపెడితే... అసలు అక్షయ తృతీయ రోజున ఏమి చేయాలి అన్న విషయాలను తెలుసుకుందాం. ఈ రోజున ఉదయాన్నే లేచి గంగాస్నానం లేదా నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేయటం అత్యంత శ్రేయస్కరం. శ్రీకృష్ణునికి చందనం పూయటం వలన విష్ణుమందిర వాసం లభిస్తుందని నమ్మకం. పానకం, వడపప్పు వంటివాటిని విష్ణువుకు నివేదించిన శుభం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి